వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడిపై ఏఎస్పీ దాడి చేశారు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్పై ఏఎస్పీ అప్పలనాయుడు దాడికి దిగారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో పోలింగ్ ఏజెంటుగా వ్యవహరిస్తున్న ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ను ఏఎస్పీ పోలింగ్ బూత్ నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు.
పోలీసులు అసలు పోలింగ్ బూత్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేవలం బూత్ వెలుపల భద్రత కల్పిస్తే చాలని నిబంధనలు చెబుతున్నా, ఏఎస్పీ మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. ఎమ్మెల్యే కుమారుడితో పాటు ఓటర్లు, ప్రజల మీద కూడా ఏఎస్పీ దాడి చేశారు. దీనిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.