సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర మూడో రోజులో భాగంగా ప్రొద్దుటూరు శివాలయ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు నేతలు ప్రసంగించారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ మునుపెన్నడూ లేని విధంగా అధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. బీసీల ధైర్యం సీఎం వైఎస్ జగన్. 2019కి ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీలో ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. సామాజిక సాధికారిత బస్సుయాత్రను నల్లబ్యాడ్జిలతో అడ్డుకుంటామని లోకేష్ అంటున్నాడు.
చేసిన తప్పుకు తండ్రి చంద్రబాబు జైల్లో ఉంటే తనయుడు లోకేష్ ఐదు రోజులు రాష్ట్రంలో లేడు. జైల్లో వేస్తారనే భయంతో ఢిల్లీకి పారిపోయాడు. తప్పులన్నీ రెడ్ బుక్‌లో రాస్తున్నాను అంటున్న లోకేష్ 2024 తరువాత ఆ రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు. ఎవరైనా తాను ముఖ్య మంత్రి కావాలని పార్టీ పెడతారు.. దత్త పుత్రుడు మాత్రం చంద్ర బాబు సీఎం కావాలని పార్టీ నడుపుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నంత వరకూ సీఎం జగన్‌ను గద్దె దించాలని చూడటం ఆ పార్టీలకు సాధ్యం కాదు’ పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘75 ఏళ్ల భారత దేశంలో సామాజిక న్యాయం అనేదానికి సార్థకత కల్పించారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మంత్రి వర్గ కూర్పులో బీసీలకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ బీసీలకు చేసేందేమీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికార దిశగా చేయిపట్టుకుని వైఎస్సార్‌సీపీ ముందుకు నడిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్క ఎస్సీ మంత్రి లేరు. కేవలం ఎన్నికలు దగ్గర పడ్డాక మైనార్టీలకు టీడీపీ పదవులు ఇచ్చింది. సీఎం జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని వెనుక బడిన వర్హాకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. నవ రత్నాలు ద్వారా రాష్ట్రం లోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు.
ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. ‘తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాలను విజయవతంగా అమలు చేస్తున్నారు. కార్పోరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి వైఎస్సార్ తీసుకువస్తే, వేల రోగాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే.
టిడిపి గత ఎన్నికల్లో ఇచ్చిన మనిపెస్తో అమలు చేయలేదు.వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టబడి నవరత్నాలు అందించారు.నేను 30 ఏళ్లు టిడిపిలో ఉన్నా ఎంపి పదవి ఇస్తానని చెప్పి మోసం.చేశారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పదవి ఇచ్చి నాకు న్యాయం.చేసింది. నాలాంటి ఎంతో మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment