సాక్షి, గుంటూరు: అమిత్ షా ఇంటిముందు శివరాత్రి జాగారం చేసి చంద్రబాబు పొత్తులకు ఒప్పించాడంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు అనైతికమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అని, చంద్రబాబుకు మద్దతు పలకడని లక్ష్మీపార్వతి అన్నారు.
వరుణ్ తేజ్ ప్రచారం చేస్తే టీడీపీ పొత్తుకు ఓట్లేమీ పడవు. వారు రీల్ హీరోలే గాని రియల్ హీరోలు కాదు. ఈ సిద్దం సభ ద్వారా మరోసారి సీఎం జగన్ సత్తా తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని లక్ష్మీపార్వతి అన్నారు.
కేసుల నుంచి బాబు తప్పించుకోవడానికే..
వైఎస్సార్ జిల్లా: ఏ ప్రయోజనం కోసం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం కోసమా, విశాఖ స్టీల్ కోసమా, ప్రత్యేక హోదా కోసమా, రాష్ట్ర అభివృద్ది కోసమా దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో వివరణ ఇవ్వాలన్నారు. గతంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దూది ఏకి పారేసినట్లు విమర్శించే బాబు ఇప్పుడు కలయిక ఏంటి? నరేంద్ర మోదీని, అమిత్ షా పట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు ఎవరూ మర్చిపోరు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్సే కారణం’’ అని శివప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ఉనికి కోసం, లోకేష్ రాజకీయ భవిషత్తు కోసం ఈ పొత్తు. గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా’’ శివప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాట: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ సారి 75 శాతం ఓట్లతో తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడింది. సింహం సింగిల్‌గా వస్తుంది అనేలా జగన్ సింగిల్‌గా వస్తారు. మళ్లీ సీఎం అవ్వడం ఖాయం. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేసిన మంచి ఏంటి? కరవును తోడుగా తెచ్చారు వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్దారు. కాలర్ ఎగరేసి చెప్పే దమ్ము ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 175కి 175 స్థానాల్లో అలవోకగా గెలుస్తాం’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment