రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ | Lakshmi Parvathi Letter To President Droupadi Murmu | Sakshi
Sakshi News home page

భార్యగా అసలైన వారసురాలిని నేనే.. రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి ఫిర్యాదు లేఖ

Published Thu, Aug 24 2023 7:30 PM | Last Updated on Tue, Aug 29 2023 6:56 PM

Lakshmi Parvathi Letter To President Droupadi Murmu - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్‌ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 

ఎన్టీఆర్‌ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్‌ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే ఎన్టీఆర్‌ చనిపోయారని, ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement