Rs.100 coins
-
ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్
లక్డీకాపూల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని ముద్రించింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా 1,2000 నాణేలను ప్రభుత్వం విడుదల చేయగా, వీటి కోసం ఎన్టీఆర్ అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం సైఫాబాద్‌లోని మింట్ కాంపౌండ్ వద్ద నాణేల అమ్మకాలు ప్రారంభం కాగా, గంటల తరబడి క్యూలో ఉండి ఎన్టీఆర్ నాణేలను చేజిక్కించుకుంటున్నారు. రూ.4,850, రూ.4,380, రూ.4,050గా ధరలు నిర్ణయించిన అధికారులు గిఫ్ట్ బాక్స్‌తోపాటు వంద నాణేన్ని అమ్ముతున్నారు. -
రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే ఎన్టీఆర్ చనిపోయారని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో! -
మారణకాండకు వందేళ్లు : రూ.100 నాణెం విడుదల
అమృతసర్ : జలియన్ వాలాబాగ్ మారణహోమం జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నబిట్రీష్ దుశ్చర్యకు వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నాణేలను శనివారం విడుదల చేశారు. పంజాబ్‌లోని అమృతసర్‌లోని జలియాన్ వాలాబాగ్ స్మారకం వద్ద వెంకయ్యనాయుడు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నంగా కొత్త వంద రూపాయల నాణేన్ని, స్టాంప్‌ను రిలీజ్ చేశారు. కాగా భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జనలర్ డయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్ కాల్పుల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా వందేళ్ళ తరువాత జలియన్‌వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్ ప్రధాని థెరిసా మే వ్యాఖ్యానించడం తెలిసిందే. -
త్వరలో 100 రూపాయిల కాయిన్: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూ. 100, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్‌పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది. వంద రూపాయిల కాయిన్ వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్ బొమ్మ ఉంటుందని తెలిపింది. కాయిన్ బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 కాయిన్ బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా కాయిన్స్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.