
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. అయితే..
నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం. దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.
గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారాయన.
I have written to the Honourable President of India, Smt. Droupadi Murmu ji, seeking her kind intervention in the matter of thousands of qualified school teachers in West Bengal who have lost their jobs following the judiciary's cancellation of the teacher recruitment process.
I… pic.twitter.com/VEbf6jbY2F— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2025