‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’ | Lakshmi Parvathi Slams Chandrababu Naidu And Nara Lokesh Over Skill Scam And IRR Case - Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’

Published Mon, Oct 2 2023 3:34 PM | Last Updated on Mon, Oct 2 2023 6:15 PM

Lakshmi Parvathi Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నీచ చరిత్రను భార్య భువనేశ్వరి మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.  రాజధాని పేరుతో అమరావతిలో చేసింది పెద్ద అవినీతేనని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. విజయవాడ నుంచి మీడియాతో మాట్లాడిన ఆమె..  ‘ చంద్రబాబు, లోకేష్‌లు నీతిమంతులైతే విచారణ ఎదుర్కోవాలి కదా?,  చంద్రబాబు తరహాలోనే లోకేష్‌ కూడా అవినీతి చేశారు.

అవినీతిపరులకు భువనేశ్వరి సపోర్ట్‌ చేయడం ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. ఎన్టీఆర్‌కు ఏనాడైనా భోజనం పెట్టావా భువనేశ్వరి?, చంద్రబాబు దోచిన డబ్బంతా విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. చంద్రబాబు తన అవినీతి కేసులకు ఎందుకు స్టే తెచ్చుకున్నారు.  చంద్రబాబు హైటెక్‌ సిటీ కట్టి దాని చుట్టూ ఉన్న భూములను తన వారికి కట్టబెట్టారు’ అని లక్ష్మీ పార్వతి విమర్శించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement