‘పోసాని భార్యను అవమానించడం దారుణం.. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు’ | Lakshmi Parvathi Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Lakshmi Parvathi: 'పవన్‌ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవు'

Published Wed, Sep 29 2021 12:05 PM | Last Updated on Wed, Sep 29 2021 1:14 PM

Lakshmi Parvathi Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ: మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి ఫైర్‌ అయ్యారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా ఉండటం మానవత్వం కాదు. నీచ నికృష్ట రాజకీయ చదరంగం ప్రారంభించి, చివరకు సంస్కార హీనుల్ని తయారుచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు.

బాబులాగే ఇటువంటి హీనరాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెప్తాడు' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చదవండి:  (బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement