సాక్షి, గుంటూరు: మంగళగిరిలో నారా లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, లక్ష్మీపార్వతి ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకేష్ ఎంట్రీతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. దీనికి ఉదాహారణే వెంకటరెడ్డి హత్య. చంద్రబాబు, నారా లోకేష్ హింసా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు. రాజధాని భూముల కేసుల్లో ఇప్పటకే మాజీ మంత్రి నారాయణ, పుల్లారావులు ఉన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్రం తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీ, బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. అవినీతి, దుర్మార్గానికి మారుపేరే చంద్రబాబు. అటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్‌సీపీపై విష ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మేలు చేసే వ్యక్తి. భూములు లాక్కునే వ్యక్తి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment