
సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదని, ఇక నుంచి చంద్రబాబు స్కాంలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయన్నారు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన బైరెడ్డి.. ‘ ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నది.నాకున్న పరిచయాలు పెద్దవి అనే అహంకారం చంద్రబాబుది.
నా స్నేహితులు అన్ని రంగాల్లో ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే చంద్రబాబు అన్ని స్కాంలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదు కాబట్టి ఆయనకు ఎవరూ అండగా నిలబడలేదు. సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిపనో కాదో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ అవినీతి చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు, నీరు చెట్టులో పెద్ద అవినీతి చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు జైలుకు పోతారు నాకేంటిలే అని చంద్రబాబు అవినీతి చేశాడు. రోడ్లు వేయకుండా డబ్బు తినేశారు. ఎవరైనా పుష్కరాలు పుణ్యం కోసం చేస్తారు.. చంద్రబాబు డబ్బుల కోసం చేశాడు’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment