సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ఛాప్టర్ పుత్రుడు, దత్త పుత్రుడు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరంటూ చంద్రబాబు నాయుడికి చురకలు అంటించారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమని, కష్టపడుతున్నాడు గనుకే ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ధనవంతుడు అయ్యాడే తప్ప.. పేదల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు.
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేదు. పైగా ఇసుక మీద రూ. 4 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అవినీతిలో బాబుకి స్టాన్‌ఫర్డ్‌యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించాడు. ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించాడు. నాయీ బ్రాహ్మణులను జైల్లో పెడతానన్నాడు. అందుకే 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి, పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు అని తేల్చేశారామె.
అయోమయం లోకేష్
పనికి మాలిన నారా లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు చంద్రబాబు. అయినా అతనిలో మార్పు రాలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా లోకేష్‌ను ప్రజలు స్వీకరించడం లేదు. అసలు ఆ పోలికే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నాడు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని.. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగినట్లు విమర్శిస్తున్నాడు. నందమూరి అభిమానులు చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలి. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పగించాలి అని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు.
ఇప్పుడే ఇలా మాట్లాడితే ఎలా?
అధికారంలోకి రాక ముందే.. చంద్రబాబు సొంతపుత్రుడితో పాటు దత్తపుత్రుడు సైతం చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. సినిమాలు చేసుకుంటున్న పవన్‌ని తెర మీదకు తెచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్‌కి చెప్పాను అని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు.
చీడ పురుగులు పోతేనే..
అమ్ముడుపోయే నాయకులు అన్ని పార్టీలో ఉంటారు.. అలాంటి చిడ పురుగులు వెళ్లిపోతేనే పార్టీ బలపడుతుంది. రాజకీయంగా చంద్రబాబును నమ్మకున్న వారు భూస్థాపితం అవ్వడం ఖాయం. గతంలో 23 మంది ఎమ్మెల్యే లను చంద్రబాబు కొనుగోలు చేశాడు. పార్టీ మారిన ఆ 23 మంది ఎమ్మెల్యే లకు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. ఒడిపోతాము, టికెట్ రాదనే భయంతోనే వాళ్ళు పార్టీ జంప్ చేశారు.. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు రాని ఇబ్బంది, ఆ ముగ్గురికి ఏమొచ్చింది? కేవలం పార్టీ గుర్తు మీద గెలిచి స్వార్దం కోసం పార్టీ మారరు వాళ్లు అంటూ పేర్కొన్నారామె.
ఇదీ చదవండి: దగ్గరుండి పవన్ పరువు తీసేశారు!
Comments
Please login to add a commentAdd a comment