
( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తమ పార్టీ, బంధువుకు కాకపోయినా ఎన్టీఆర్‌ను సీఎం జగన్ గౌరవించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు జగన్‌మోహన్‌రెడ్డి. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది. టీడీపీ పార్టీని లాక్కుని ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేశాడు. మొదటి నుంచి ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు కక్ష.. వ్యతిరేక భావం. ఎన్టీఆర్ మంచివాడు కాదు అని బ్యాడ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. భారతరత్న విషయంలో కూడా ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేశాడు. టీడీపీ దొంగల పార్టీగా తయారైంది’’ అని అన్నారు. ఇక, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment