సాక్షి, గుంటూరు: చంద్రబాబు దుర్మార్గుడు, అబద్దాల కోరు అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. గుంటురులో రెండో రోజూ కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. 'అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను పెట్టుకొని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు. బాబు అనకూడని, వినకూడని మాటలు అనిపించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. సంస్కారానికి, చంద్రబాబుకి చాలా దూరం ఉంది. అబద్దం చంద్రబాబుతోనే పుట్టింది. అతనితోనే పెరిగింది. అతనితోనే పోతుంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే గెలవలేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో రోజుకో నూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. చంద్రబాబు కోర్టుకెళ్లి స్టే తెచ్చాడు. అమరావతి అంటాడు ఇక్కడ మాత్రం మా అల్లుడికి ఇళ్లు లేదు. నేను వచ్చేటపుడు చూశాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర బిర్యానీ పొట్లాలు అందలేదని కొంతమంది, డబ్బులు అందలేదని మరికొంతమంది గొడవ చేస్తున్నారు. తినటానికి వీలుగా వెనుక ఒక తెర కట్టుకుని మా అల్లుడు దీక్ష చేస్తున్నాడు. రాష్ట్రంలో మహానేత పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు మహానేతగా తయారు చేశారు' అని లక్ష్మీపార్వతి అన్నారు.
చదవండి: (చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల)
Comments
Please login to add a commentAdd a comment