
సాక్షి, తాడేపల్లి: హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అలాగే, చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కుట్రలు, కుతంత్రాలకు ప్రతిబింబం చంద్రబాబు. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి చంద్రబాబు. తన రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే. అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడుతూ బయట మాత్రం సుద్దులు చెప్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు, శిక్షలు ఎందుకు విధించడం లేదు.
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ పథకాలకు పేరు పెడితే తప్పు పడుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో ప్రతి చెట్టు, పుట్టకు పచ్చ రంగులు వేయలేదా?. చంద్రన్న తోఫా పేరుతో సంచుల మీద కూడా చంద్రబాబు ఫొటోలు వేయలేదా?. రాజకీయ కక్షతోనే ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేశారు. నన్ను రోడ్డు మీద పడేశారు.
వినుకొండలో రషీద్‌ను దారుణంగా హత్య చేయించింది ఎవరు?. పోలీసులను కీలు బొమ్మల్లా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు. మహిళల మీద అత్యాచారాలు చేసినా.. టీడీపీ గూండాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు. వైఎస్ జగన్ తెచ్చిన పథకాలను కాపీ కొట్టటానికి సిగ్గులేదా చంద్రబాబూ?. వైఎస్ జగన్‌పై రెండు సార్లు హత్యాయత్నం చేయించిన నీచుడు బాబు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి. చంద్రబాబు నీచ, హత్యా రాజకీయాలు ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment