Lakshmi Parvathi Shocking Comments On TDP Goes Viral - Sakshi
Sakshi News home page

‘టీడీపీ అండ్‌ కో పిచ్చి మాటలు మానుకోవాలి’

Published Mon, Aug 30 2021 1:27 PM | Last Updated on Mon, Aug 30 2021 6:23 PM

Lakshmi Parvathi Comments On TDP - Sakshi

టీడీపీ అండ్ కో ఇకనైనా అర్ధం పర్థం లేని పిచ్చి మాటలు మానుకోవాలని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి హితవు పలికారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: టీడీపీ అండ్ కో ఇకనైనా అర్ధం పర్థం లేని పిచ్చి మాటలు మానుకోవాలని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి హితవు పలికారు. తెలుగు సరిగా రానివాళ్లు కూడా తెలుగు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మతిలేని వాళ్లు రాసిన స్ర్కిప్ట్‌ను వాళ్లు చదువుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో తెలుగు భాషకు ఇప్పుడు సరైన పునాది పడుతోంది. ప్రైవేట్‌ స్కూళ్లలో తెలుగును తప్పనిసరి చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయ పునరుద్ధరణ జరగబోతోందని, ఏపీలో తెలుగు భాషకు నిజమైన పట్టం కట్టబోతున్నామని లక్ష్మీ పార్వతి అన్నారు.

ఇవీ చదవండి:
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ
ఇంటర్‌లో సీఈసీ చేశారా.. కామర్స్‌ కోర్సులకు మంచి డిమాండ్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement