
తిరుపతి తుడా/చిల్లకూరు: చంద్రబాబు స్వలాభం కోసం టీడీపీని సర్వనాశనం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో పలు డివిజన్లలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలసి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఆమె మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు పదేళ్లు ఇంటికే పరిమితమైన చంద్రబాబు ఒక శాతం అధిక ఓట్లతో 2014లో సీఎం అయ్యాడని, ఆ ఐదేళ్లు ప్రజలను పీడించి పిప్పిచేశారని విమర్శించారు.
కొడుకు లోకేష్‌ను రాజకీయాల్లోకి తెచ్చి అవినీతితో లక్షకోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన టీడీపీని సర్వనాశనం చేశారని, తన సంపాదన కోసం పార్టీని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. గురుమూర్తికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు చిల్లకూరు మండలంలోని మోమిడిలోని వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి నివాసానికి చేరుకున్న లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడారు. పవన్ రోడ్‌షోలో తిరుమల పవిత్రతపై లేనిపోనివి మాట్లాడారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment