
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుతో కలిసి రజినీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారారని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, రజనీకి చిత్తశుద్ది ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని హితపు పలికారు. అవేమీ లేకుండా పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన జనం నమ్మరన్నారు.
బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో.. రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి విశ్వసనీయతే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రజనీకాంత్‌కు లేదని స్పష్టం చేశారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేదన్నారు.
చదవండి: ‘పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు రజినీ రంగంలోకి!’
‘వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్.. తర్వాత ఎన్టీఆర్‌ను కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారు. వెన్నుపోటు ఎపిసోడ్‌లో రజనీకాంత్‌పై అనేక విమర్శలు వచ్చాయి. తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు రాశాయి. ఆ తర్వాత చాలా కాలంగా ఏపీ రాజకీయాల వైపు రాలేదు.
ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ చంద్రబాబు తెలివిగా రజనీకాంత్‌ను వాడుకుంటున్నారు. రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్. అనేక సర్వేల్లో జగన్ పాలనపై ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు వస్తుంది. దీంతో చంద్రబాబు తట్టుకోలేక మళ్లీ సినిమా వాళ్లతో డ్రామాలాడిస్తున్నారు.’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
చదవండి: ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సీఐడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment