నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది: లక్ష్మీపార్వతి | Lakshmi Parvathi Slams Chandrababu Naidu Govt Over YSRCP Social Media Activists Arrests, Watch Video Inside | Sakshi
Sakshi News home page

నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది: లక్ష్మీపార్వతి

Published Fri, Nov 8 2024 2:26 PM | Last Updated on Fri, Nov 8 2024 4:52 PM

Lakshmi Parvathi Slams Chandrababu Govt Over YSRCP Social Media Arrests

జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే.. కార్యకర్తల అరెస్టులు

పాలన చేతకాక చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌

ఈనాడు పేపర్‌ కాదు.. విష పత్రిక

బాబు, రామోజీలు ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు

YSRCP సో.మీ. యాక్టివిస్టుల అక్రమ నిర్బంధాలపై  లక్ష్మీపార్వతి ఆగ్రహం

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

కూటమి సర్కార్‌ ప్రజాసమస్యలను గాలికి వదిలేసింది. హామీల అమలుపై ప్రశ్నిస్తే.. అక్రమకేసులు పెడుతున్నారు. అర్థరాత్రి సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారు.  జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారు. పాలన చేతకాక చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారు. 

ఎప్పటి నుంచో ఎల్లో మీడియా సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. బాబు, రామోజీ ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు. ఈనాడు పేపర్‌ కాదు.. విష పత్రిక. మార్గదర్శి పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టారు. ఈనాడులో ఎన్టీఆర్‌పై ఎన్నో దారుణమైన కార్టూన్లు వేశారు. ఎన్టీఆర్‌ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారు. 

 

ఈ మేరకు.. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను అవమానిస్తూ.. కించపరుస్తూ వేసిన కార్టూన్లను ఆమె మీడియాకు ప్రదర్శించి చూపించారామె. అలాగే.. 

దోచుకోవడం, వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే బాబుకు తెలుసు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. పారిపోయాడు. నీచపు చంద్రబాబుకు కాలమే బుద్ధి చెప్తుంది’’ అని లక్ష్మీపార్వతి అన్నారు.

కూటమి ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement