లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత | samantha lady oriented film with vikram k kumar | Sakshi
Sakshi News home page

లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత

Published Sun, Dec 20 2015 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత

లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న సమంత త్వరలోనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కాస్త కొత్తగా ట్రై చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన నవమన్మథుడు సినిమాలో గ్లామర్ షో ఏ మాత్రం లేని సాధారణ గృహిణి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇదే జోష్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది.

ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న 24 సినిమాతో పాటు, నితిన్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్న అ.. ఆ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. మనం, 24 సినిమాల్లో సమంత యాక్టింగ్కు ఫిదా అయిన దర్శకుడు విక్రమ్ కుమార్ సమంత లీడ్ రోల్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లేది మాత్రం కన్ఫామ్ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement