రామ్‌ చరణ్‌తో కాదు.. నాగ చైతన్యతో! | Vikram K Kumar To Direct Naga Chaitanya For His Next Telugu Movie | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌తో కాదు.. నాగ చైతన్యతో!

Published Tue, Mar 3 2020 8:54 PM | Last Updated on Tue, Mar 3 2020 8:54 PM

Vikram K Kumar To Direct Naga Chaitanya For His Next Telugu Movie - Sakshi

వైవిధ్యమైన కథాంశాలతో సినీ ఇండ​స్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రతిభ గల డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌. ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రంతో ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేశాడు ఈ క్రేజీ డైరెక్టర్‌. గ్యాంగ్‌ లీడర్‌ తర్వాత ఇప్పటివరకు మరో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. అయితే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు ఓ స్టోరీ లైన్‌ వినిపించాడని, చెర్రీకి నచ్చడంతో తన తదుపరి సినిమా అవకాశం విక్రమ్‌కు ఇచ్చాడని  టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిచ్చాయి. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తయ్యేలోపు పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. 

అయితే ఏమైందో ఏమో కాని విక్రమ్‌ కుమార్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. తన తదుపరి సినిమా రామ్‌చరణ్‌తో కాకుండా నాగచైతన్యతో తీసేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమా తెరకెక్కించనుందని టాలీవుడ్‌ టాక్‌. ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన విక్రమ్‌ కుమార్‌తో మరో సినిమా చేసేందుకు నాగ చైతన్య సైతం ఆసక్తి కనబరుస్తానడట. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్‌ స్టోరీ’తో చైతూ బిజీగా ఉన్నాడు. లవ్‌ స్టోరీ తర్వాత చైతూకి మరో రెండు కమిట్‌మెంట్స్‌ ఉండటంతో.. ఆ రెండింటి తర్వాతనే విక్రమ్‌తో చైతూ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో చిన్న వెబ్‌ సిరీస్‌ తీసే ఆలోచనలో కూడా విక్రమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

చదవండి:
చైతూకి 49, సమంతకు 51: సామ్‌ ట్వీట్‌!
ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి : ఉపాసన​​​​​​​
​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement