అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..? | Akhil third movie with surender Reddy | Sakshi
Sakshi News home page

అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?

Published Thu, Dec 22 2016 3:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?

అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాను ప్రారంభించబోతున్నాడు అఖిల్. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అఖిల్ అదే సమయంలో తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఇటీవల ధృవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్గా పేరున్న సురేందర్ రెడ్డితో సినిమా చేసే అఖిల్ కెరీర్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అక్కినేని టీం. అందుకే రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే మూడో సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement