అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది.
‘‘స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కులు మనాలీలో విజయ్ మాస్టర్ నేతృత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రసూల్ ఎల్లోర్.
Grappling to STRIKE HARD 👊🏾#AGENT Shoot progressing at a brisk pace in Manali with fierce action sequences💥💥#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/f1daRar0O0
— SurenderReddy (@DirSurender) May 25, 2022
చదవండి: విషాదం.. టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి
కిచ్చా సుదీప్, జాక్వెలిన్‌ల 'రారా రక్కమ్మా..' సాంగ్ విన్నారా?
Comments
Please login to add a commentAdd a comment