![Surender Reddy Injured In Agent Movie Shooting - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/surender-reddy.gif.webp?itok=6YaF3qNo)
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్‌లో గాయపడ్డాడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏజెంట్ మూవీ షూటింగ్‌లో డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో ఎడమకాలికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి సెట్‌లో అడుగుపెట్టాడు.
గాయంతో బాధపడుతూనే ఏజెంట్‌లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. వీల్‌చైర్‌లో కాలికి కట్టుతో ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? ఫ్యాన్స్‌కు పూనకాలే
Comments
Please login to add a commentAdd a comment