విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..? | Akkineni Akhil next with Vikram k Kumar | Sakshi
Sakshi News home page

విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..?

Published Sun, Aug 14 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..?

విక్రమ్ దర్శకత్వంలో అఖిల్..?

అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో చాలా రోజులగా కథ ఎంపిక విషయంలోనే కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇటీవల సినిమా ఫైనల్ అయినట్టుగా వార్తలు వినిపించినా అది కూడా పట్టాలెక్కేలా కనిపించటం లేదు.

అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడితో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించాడు అఖిల్. అయితే నిర్మాణ పరమైన సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మరో దర్శకుడి కోసం అఖిల్ ప్రయత్నాలు ప్రారంభించాడట.

అదే సమయంలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసిన విక్రమ్ కుమార్తో అఖిల్ సినిమా ఉంటుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మనం, 24 లాంటి వరుస హిట్స్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తే అఖిల్ కెరీర్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement