అఖిల్ కోసం స్వీట్ టైటిల్.? | Akhil second Movie Title Junnu | Sakshi
Sakshi News home page

అఖిల్ కోసం స్వీట్ టైటిల్.?

Published Tue, Mar 14 2017 3:41 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

అఖిల్ కోసం స్వీట్ టైటిల్.?

అఖిల్ కోసం స్వీట్ టైటిల్.?

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన అఖిల్, రెండో ప్రయత్నంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా ఓ క్యూట్ లవ్ స్టోరి చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన తాజా అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది. అఖిల్ను లవర్ బాయ్గా చూపిస్తున్న ఈ సినిమాకు 'జున్ను' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement