Junnu
-
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..రుచికరమైన జున్ను: ఎన్నో ప్రయోజనాలు
ఆధునిక కాలంలో, అందులోనూ పట్టణాల్లో జున్ను దొరకడమే గగనంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే జున్ను అంటే భవిష్యత్తరానికి దూరమైపోతోంది. పశువులు, పాడి పంట పుష్కలంగా ఉన్న ఇళ్లల్లో కూడా అరుదుగా దొరుకుతుంది. జున్ను అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి జున్నుపాలు సామాన్యులకు దొరికాయంటే పండగ అన్నట్టు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా జున్ను ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం.జున్ను పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా.. తియ్య..తియ్యగా, కారం కారంగా, మధ్య మధ్యలో అలా మిరియం గింజలు తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. జున్ను మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.కావలసిన పదార్థాలుజున్ను పాలు (ఆవు లేదా గేదె ఈనినపుడు మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలు), ఒక గ్లాసు, సాధారణ పాలు - మూడు గ్లాసులు, కప్పు బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి.తయారీ విధానంఒక గిన్నెలో ఒక గ్లాసు జున్నుపాలు, మామూలు పాలను కలపాలి. ఇందులో బెల్లం తురుము, పంచదార కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే మిరియాల పొడి, యాలకుల పొడి వేసి కూడా బాగా కలపాలి. దీనికి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో జున్ను పాల మిశ్రమాన్ని పోసి మూతపెట్టి వేడి నీటిగిన్నెలో ఉంచి ఉడికించుకోవాలి. గిన్నెలో సగం మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. లేదంటే పొంగిపోయే అవకాశ ఉంది. ప్రెషర్ కుక్కర్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.జున్నుతో ఆరోగ్య ప్రయోజనాలుజున్ను పాలు చాలా చిక్కగా, పసుపు రచ్చ రంగులో ఉంటాయి. జున్నులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కె, రిబో ఫ్లావిన్, జింక్, ప్రోటీన్ వంటివి అధికంగా ఉంటాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జున్నులో ఉండే అధికంగా లభించే కాల్సియం, పోషకాల కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. జున్నులో ఉండే ప్రోటీన్ కంటెంట్ శరీరానికి శక్తిని అందిస్తుంది. కృత్రిమంగా కూడా జున్నుఒక కప్పు చిక్కటి పాలల్లో రెండు ఎగ్స్‌ను వేసి, బాగా గిలక్కొట్టి, మామూలు జున్ను తరహాలోనే బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి ఆవిరిమీద ఉడించుకోవచ్చు. మార్కెట్లో ఆర్టిఫిషియల్ గా చైనా గ్రాస్ తో తయారు చేస్తున్న జున్ను లభిస్తుంది. -
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!
పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్లో చేరిస్తే మంచిది. ►పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి. ►ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి. ►వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇవి కూడా... ►అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ►వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు. ►ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ►ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట. చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
జున్నూతో నానీ
‘‘మా దొంగ రాస్కెల్ బర్త్‌డే ఇవాళ (గురువారం). జున్నుగాడి ఫస్ట్ బర్త్‌డే ఇది’’ అంటూ నానీ ఈ ఫొటోను షేర్ చేశారు. జున్ను అసలు పేరు అర్జున్. ఇంతకీ జున్ను అని చదవగానే ‘హలో’ సినిమా గుర్తొస్తోంది కదూ. అందులో హీరోయిన్ కల్యాణి ముద్దు పేరు జున్ను అని గుర్తుండే ఉంటుంది. -
అఖిల్ కోసం కలర్‌ఫుల్ టైటిల్..!
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టిన సిసింధ్రీ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోయినా అఖిల్ పార్ట్ ను మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఈ సారి ఎలాగైన అఖిల్ కు బిగ్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు జున్ను అనే టైటిల్ ను నిర్ణయించారన్న ప్రచారం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిస్టర్ అవ్వటంతో అది అఖిల్ సినిమా కోసమే అని ఫిక్స్ అయ్యారు. తాజాగా అదే బ్యానర్ రంగుల రాట్నం అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారట. దీంతో అఖిల్ సినిమా టైటిల్ ఇదే అంటూ కొత్త టాక్ మొదలైంది. ఇంత వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అఖిల్ కొత్త సినిమా వార్తల్లో గట్టిగానే వినిపిస్తుంది. అఖిల్ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటునే రాజుగారి గది 2 సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్. -
అఖిల్ కోసం స్వీట్ టైటిల్.?
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొలి సినిమాతోనే మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన అఖిల్, రెండో ప్రయత్నంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాడు. ఇప్పటికే మనం, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా ఓ క్యూట్ లవ్ స్టోరి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన తాజా అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. అఖిల్‌ను లవర్ బాయ్‌గా చూపిస్తున్న ఈ సినిమాకు 'జున్ను' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.