మే 6న సూర్య 24
తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24. సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న 24 టీం ఫైనల్గా మే 6న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్కు ప్లాన్ చేసినా టాలీవుడ్లో సరైనోడు రిలీజ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు.
ఫైనల్గా సూర్య 24 రిలీజ్ కు మే 6న ముహుర్తం ఖరారు చేశారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సూర్య తన సొంత నిర్మాణసంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాడు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్పై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.