
ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని.. తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. మనం, ఇష్క్, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆర్‌ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండగా రకుల్ ప్రీత్ స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment