
బన్నీ నెక్ట్స్ సినిమా అతనితోనే..!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్, వరుసగా యాబై కోట్ల సినిమాలతో సత్తా చాటిన బన్నీ, తాజాగా సరైనోడు సినిమాతో వంద కోట్ల మార్క్ను కూడా దాటేశాడు. అదే జోరులో...
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్, వరుసగా యాబై కోట్ల సినిమాలతో సత్తా చాటిన బన్నీ, తాజాగా సరైనోడు సినిమాతో వంద కోట్ల మార్క్ను కూడా దాటేశాడు. అదే జోరులో ఇప్పుడో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. రొటీన్ మాస్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని బన్నీ, సరైనోడు సినిమాలో మాత్రం పక్కా కమర్షియల్ హీరోగా మెప్పించాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలను తెరకెక్కించే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న విక్రమ్ కె కుమార్, ఆ సినిమా రిలీజ్ తరువాత బన్నీతో చేయబోయే సినిమా పనులు మొదలు పెట్టనున్నాడు. అంతేకాదు ఈ సినిమా కథ, ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ అంటున్నాడు దర్శకుడు.
ఇష్క్, మనం సినిమాల సక్సెస్లతో టాలీవుడ్ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం 24తోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అల్లు అర్జున్, విక్రమ్ల కాంబినేషన్పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.