
విక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ముందుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాబీ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా ఫైనల్ అయ్యింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ రెండు సినిమాల తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు జూనియర్. ఇష్క్, మనం లాంటి సినిమాలతో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలనందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకె చెప్పాడు. బాబీ, త్రివిక్రమ్ల సినిమాలు పూర్తయిన తరువాత విక్రమ్ దర్శకత్వంలో సినిమాలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ లోగా విక్రమ్, అఖిల్ అక్కినేని హీరోగా సినిమాను పూర్తి చేయనున్నాడు.