తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు | suriya plans for 24 audio launch | Sakshi
Sakshi News home page

తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు

Published Tue, Apr 5 2016 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు

తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు

చాలా రోజులుగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం కష్టపడుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కొత్త సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 24 సినిమాలో నటిస్తున్న సూర్య, ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్ట్రయిట్ తెలుగు సినిమాకు ప్రమోషన్, రిలీజ్లను ఎలా ప్లాన్ చేస్తారో, అదే స్ధాయిలో కష్టపడుతున్నాడు.
 
అఫీషియల్ టీజర్ రిలీజ్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడు. తమిళ, తెలుగు ట్రైలర్లను ఒకేసారి రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఆడియో రిలీజ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని భావిస్తున్నాడు. ఈ నెల 11న 24 ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ రోజు ఉదయం చెన్నైలో తమిళ వర్షన్ ఆడియోను రిలీజ్ చేసిన, వెంటనే సాయంత్రం హైదరబాద్లో తెలుగు భాషలో ఆడియోను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
 
సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు, కాలంలో ప్రయణించటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement