
కొత్త పోస్టర్లతో సందడి చేశాడు
తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సౌత్ స్టార్ సూర్య. సౌత్లో తనను అభిమానించే ఫ్యాన్స్ కోసం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెపుతూ తన కొత్త సినిమా 24 పోస్టర్స్ను కూడా రిలీజ్ చేశాడు. కొద్ది రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తున్న సూర్య కమర్షియల్ సక్సెస్లు అందించటంలో వెనుకపడ్డాడు. అయినా మరోసారి ప్రయోగంతోనే ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 కూడా డిఫరెంట్ జానర్లో ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య, హీరోగా, విలన్గా రెండు పాత్రల్లో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్తో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. గతంలో రిలీజ్ అయిన పోస్టర్స్లో సూర్య లుక్ మాత్రమే రివీల్ చేసిన యూనిట్, న్యూ ఇయర్ కానుకగా సమంత, సూర్యలు కలిసున్న పోస్టర్ను రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాతో సూర్య సక్సెస్ ట్రాక్లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
Happy new year! May all dreams come true!! # 24 @2D_ENTPVTLTD @StudioGreen2 @deepakbhojraj @rajsekarpandian pic.twitter.com/iPz76fKHdb
— Suriya Sivakumar (@Suriya_offl) December 31, 2015