
మార్చిలో మొదలవుతుందట..!
అరంగేట్రంలోనే నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే హడావిడిగా ఏదో ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లకుండా పక్కా కథా కథనాలతో గ్యారెంటీ హిట్ అనే స్థాయి సినిమాను రెడీ చేస్తున్నాడు. ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని టీం ఫైనల్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రీ లాంచ్ కు సిద్ధమైంది.
ఈ మేరకు చాలా కాలం క్రితమే ప్రకటన వచ్చినా.. ఇంత వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎప్పుడు వెళ్తుందన్న సమాచారం కూడా లేదు. అయితే ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున, అఖిల్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న నాగ్, మార్చిలో సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు.