ఎవరీ త్రిపుర? | Tripura in the last leg of shoot | Sakshi
Sakshi News home page

ఎవరీ త్రిపుర?

Published Wed, Jun 24 2015 3:09 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

ఎవరీ త్రిపుర? - Sakshi

ఎవరీ త్రిపుర?

‘కలర్స్’ స్వాతి తొలిసారిగా టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘త్రిపుర’. అసలు త్రిపుర ఎవరు..? ఏం చేస్తుంది? అనేది సస్పెన్స్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజకిరణ్. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ నెల 15 నుంచి క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభించాం. త్రిపుర పాత్రకు ఇంకెవరూ సరిపోరనేంత బాగా స్వాతి నటిస్తున్నారు. కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.

హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement