భయపెట్టే కాకి! | kaki movie | Sakshi
Sakshi News home page

భయపెట్టే కాకి!

Published Sun, Sep 13 2015 10:09 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

భయపెట్టే కాకి!

భయపెట్టే కాకి!

కాకి అనే పక్షి చుట్టూ తిరిగే కథతో, హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కాకి’. కిరణ్ పత్తికొండ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అశోక్ కుమార్, మేఘశ్రీ ముఖ్యతారలు. మనోన్. యమ్ దర్శకుడు.  ‘‘ ‘కాకి’ అనే టైటిల్ విని చాలా మంది పోలీస్ స్టోరీ అనుకున్నారు. కానీ ఇదొక డిఫరెంట్ స్టోరీ. అనుకున్న దాని కన్నా దర్శకుడు ఈ సినిమాను బాగా తీశారు’’ అని  నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘దర్శకునిగా తెలుగులో నాకిది తొలి చిత్రం.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఎగ్జిక్యుటివ్ నిర్మాత రొనాల్డ్ రాజ్ ఎస్ విలియమ్స్ కథ అందించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిత్, కెమెరా: సర్వణ నటరాజన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement