కొంచెం నవ్వు... కొంచెం భయం | Beautiful love story | Sakshi
Sakshi News home page

కొంచెం నవ్వు... కొంచెం భయం

Published Tue, Jul 28 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

కొంచెం నవ్వు... కొంచెం భయం

కొంచెం నవ్వు... కొంచెం భయం

హారర్ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘కాకి’. అశోక్, మేఘశ్రీ జంటగా అర్పితా క్రియేషన్స్ పతాకంపై పత్తికొండ కిరణ్ నిర్మించిన     ఈ చిత్రానికి మనోన్.ఎం దర్శకుడు. రోనాల్డ్ రాజ్ ఎస్.విలియమ్స్ కథ అందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్, హారర్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కొంచెం భయపెడుతూ, కొంచెం నవ్విస్తుంది. హారర్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కచ్చితంగా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రిత్, సంభాషణలు: వినోద్ శివ, కెమెరా: శరవణ్ నటరాజన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోనాల్డ్ రాజ్ ఎస్. విలియమ్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement