ట్రైలర్ చూసి కొత్తగా ఫీలయ్యా - సునీల్ | Maya Mal Telugu Horror Thriller Movie Trailer | Sakshi
Sakshi News home page

ట్రైలర్ చూసి కొత్తగా ఫీలయ్యా - సునీల్

Published Thu, Sep 8 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

ట్రైలర్ చూసి కొత్తగా ఫీలయ్యా - సునీల్

ట్రైలర్ చూసి కొత్తగా ఫీలయ్యా - సునీల్

 ‘‘థ్రిల్, లవ్, కామెడీ.. ఇలా అన్ని ఎమోషన్స్ ఈ ట్రైలర్‌లో కనిపించాయి. శివేంద్ర కెమేరా పనితనం చాలా బాగుంది. హార్రర్ కామెడీ, ప్రేమకథా చిత్రాలు చూసి ఎంత కొత్తగా ఫీలయ్యానో, ఈ ‘మాయామాల్’ ట్రైలర్‌లో హార్రర్ చూసి అంతే కొత్తగా ఫీలయ్యా. టీజర్‌లా సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని సునీల్ అన్నారు. దిలీప్, ఇషా, దీక్షాపంత్, సోనియా ముఖ్య పాత్రల్లో గోవింద్ లాలం దర్శకత్వంలో కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘మాయామాల్’.
 
 ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్, సునీల్ విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘ట్రైలర్ భయపెట్టేలా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు కనిపించడం లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథతో మూడేళ్లు  చాలా మంది చుట్టూ తిరిగా. చివరికి ఈ నిర్మాతలు మందుకొచ్చారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని దర్శకుడు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement