రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘గూల్’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్‌లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్‌గా రాధిక ఆప్టే నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్‌హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పాట్రిక్ మీడియాతో పంచుకున్నారు.
ప్రశ్న: గూల్ తీయాలని మీకు ఎలా అనిపించింది. తొలి ప్రాజెక్టుకే ఇలాంటి స్టోరి ఎందుకు తీసుకున్నారు ?
జవాబు: నేను మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెరకెక్కిద్దామని అనుకున్నాను. ఇలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. అలాంటి థ్రిల్లర్‌ను చేయాలని నేను భావించాను. ఒక రచయితగా, దర్శకుడిగా ఇలాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ స్టోరిని తెరకెక్కించడానికి ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్‌హోయ్, బ్లమ్‌హౌస్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సహకరించాయి.
ప్ర: ఈ వెబ్ సిరీస్‌లో పాత్రల, లోకేషన్‌ల ఎంపిక ఎలా జరిగింది?
జ: ప్రశాంత్ సింగ్ నేతృత్వంలో అద్భుతమైన నటులు దొరికారు. ఇందులో ముఖ్యంగా కండలు గల సైనికుల పాత్రల ఎంపిక చాలా కీలకమైంది. కానీ మాకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. మహేశ్‌కు చాలాసార్లు స్క్రీన్ టెస్టు నిర్వహించిన తర్వాత అలీ సయీద్ పాత్రకు అతడే కరెక్ట్ అనే నిర్ధారణకు వచ్చాం. రాధిక, మానవ్‌లు ఇద్దరు గొప్పగా నటించారు. వారికి ఈ తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి ఉండటం అదృష్టంగా భావిసున్నాను. ఈ సినిమా లోకేషన్(తులిప్ స్టార్ బేస్‌మెంట్) కూడా చాలా బాగా కుదిరింది.
ప్ర: అలాంటి చీకటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇబ్బంది కలుగలేదా ?
జ: కలిగింది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేంది. గాలి కూడా సరిగా ఆడేది కాదు. కొన్ని సార్లు దుర్వాసన భరించలేనంతగా ఉండేది(ముఖ్యంగా భోజనం చేసే సమయంలో). ఈ చిత్రీకరణ సమయంలో ఏ దెయ్యాలు మాకు ఎటువంటి హానీ చెయ్యలేదు(నవ్వుతూ..)
ప్ర: మీరు దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌ను ఎందుకు ఎంచుకున్నారు ?
జ: ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చేరాలంటే నెట్‌ఫ్లిక్స్ కన్నా బెటర్ ఆఫ్షన్ కనిపించలేదు. వారు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్‌గా నిలిచారు.
ప్ర: మీరు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఎందుకు డబ్ చేశారు ?
జ: మేము గూల్ ఎంతవరకు సాధ్యమైతే అంత ఎక్కువ మందికి చేరాలని భావించాం. హిందీతోపాటు, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్‌లో డబ్ చేసిన వర్షన్‌లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఎక్కువ మంది ఈ వెబ్ సిరీస్‌ను చూడటానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో ఎవరికైతే సబ్ టైటిల్స్ చదువుతూ సినిమా చూడటం నచ్చదో వారికి కూడా డబ్ చేయడం వల్ల దీనిని చూడటానికి ఇష్టపడతారు.
ప్ర: ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
జ: ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. కొత్త రకమైన కథలు తెరకెక్కిద్దామనుకునే వారికి ఈ విజయం మంచి ఉత్సాహన్ని ఇస్తుందన్ని భావిస్తున్నాను. స్కేర్డ్ గేమ్స్‌కు ఇండియన్ అన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇంత మంచి ఆదరణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నెగిటివ్ రివ్యూలను చదవను.
Comments
Please login to add a commentAdd a comment