మరో సారి భయపెడతా! | Trisha Focus on Horror Movies | Sakshi
Sakshi News home page

మరో సారి భయపెడతా!

Published Sun, Sep 11 2016 2:41 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

మరో సారి భయపెడతా!

మరో సారి భయపెడతా!

 ఒక  పక్క కమర్షియల్ చిత్రాలు, ప్రేమ, హాస్యభరిత చిత్రాలు వస్తున్నా, హారర్ చిత్రాల ట్రెండ్‌కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదనిపిస్తోంది. ఇంతకు ముందు చిన్న తారలు, మార్కెట్‌లేని సీనియర్ నటీనటులు హారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ప్రముఖ తారలే నటించడానికి రెడీ అంటున్నారు. ముఖ్యంగా టాప్ కథానాయికలతో హారర్ కథా చిత్రాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మాయ చిత్రంలో నటించిన నయనతార తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్ర నాయకిగా హిట్‌ను అందుకున్నారు.
 
ప్రస్తుతం ఆ తరహా కథాంశంతో రూపొందుతున్న దోర అనే దెయ్యం ఇతివృత్తంతో సాగే నాయకి పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటించడానికి నయనతార రెడీ అవుతున్నారు. ఇక మరో సంచలన నటి త్రిష కూడా నయనతార బాణీనే అవలంభిస్తోందని చెప్పవచ్చు. నిన్నటి వరకూ కుటుంబకథా చిత్రాల నాయకిగా నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు హారర్ చిత్రాలపైకి దృష్టి మళ్లించారు.
 
  త్రిష ద్విపాత్రాభినయం చేసిన నాయకి చిత్రం తెలుగులో తెరపైకి వచ్చి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.త్వరలో తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మోహిని అనే మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తున్నారు. అధిక భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఇదీ హారర్ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమే.తాజాగా మరో హారర్ చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
 ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అనీ, ఆ చిత్ర డీవీడీని ఓ ప్రముఖ నిర్మాత చూడమని త్రిషకు పంపినట్లు తెలిసింది. ఆ చిత్రం చూసిన త్రిష దాని రీమేక్‌లో నటించడానికి సమ్మతించినట్లు టాక్. ఇందులోనూ ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement