ఈమె తెలుగు ఓ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తెలుగునాట కథానాయికగా భలే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో అదిరిపోయే క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ)
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోహిని. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీ 'ఆదిత్య 369'. ఈ సినిమాలో నటించిన హీరోయినే ఈమె. తమిళనాడులోని తంజావుర్‌లో పుట్టి పెరిగిన ఈమె.. 1991లో 'ఈరమణ రోజావే' చిత్రంతో కథానాయికగా మారింది. అదే ఏడాది తెలుగులో వచ్చిన 'ఆదిత్య 369'లో హీరోయిన్‌గా చేసిన తర్వాత ఈమెకు బోలెడంత ఫేమ్ దక్కింది.
'ఆదిత్య 369' సినిమాతో పాటు 'డిటెక్టివ్ నారద', 'మామ బాగున్నావా', 'హిట్లర్' తదితర తెలుగు సినిమాల్లో మోహిని హీరోయిన్‌గా చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. 2011లో చివరగా 'కలెక్టర్' అనే మలయాళ మూవీలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇక 1999లోనే భరత్ అనే వ్యక్తిని మోహిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నాడు. అయితే చాలారోజుల తర్వాత రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో కనిపించిన మోహినిని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తొచ్చి ఈమె ఆమే కదా అని మాట్లాడుకున్నారు. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?)
Comments
Please login to add a commentAdd a comment