విజయ్, చంద్రశేఖర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టాలని తమిళ నటుడు విజయ్‌కు ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ సూచించారు. చంద్రశేఖర్ మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో... ప్రజల గురించి ఆలోచించే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందన్నారు. ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు(విజయ్) రేపు అధికారంలోకి రావచ్చన్నారు. ‘విజయ్ ఒక గాంధేయవాది.
రాజకీయాలపై కొన్నేళ్లుగా అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని చెప్పారు. విజయ్ నటించిన ‘మెర్సల్’లోని పలు సన్నివేశాలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment