చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు, గురువారం ఎన్నికల సంఘం వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్ చేయించాడంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన విజయ్ టీం అవన్నీ వట్టి వందతులేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ మాత్రం.. ‘‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయాక్కం’’పేరిట పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించినట్లు వెల్లడించడంతో మరోసారి సస్పెన్స్ నెలకొంది. విజయ్‌తో ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ, అభిమానులు మాత్రం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపర్చలు చేశారు.
ఈ క్రమంలో విజయ్ పేరిట ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ స్పందన కోరుకుంటున్న వాళ్ల కోసం ఈ అధికారిక ప్రకటన అంటూ పీఆర్‌ఓ రియాజ్ అహ్మద్ షేర్ చేసిన లేఖలో.. ‘‘మా నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్ ఈరోజు రాజకీయ పార్టీ ప్రారంభించారని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీని వల్ల నా అభిమానులకు, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా. మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. కేవలం మా నాన్న స్థాపించారన్న కారణంగా, ఈ పార్టీలో చేరమని గానీ, పార్టీ కోసం పనిచేయమని గానీ నేను చెప్పదలచుకోలేదు. మనం మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ఉద్యమానికి, పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే విజయ్ మక్కల్ ఇయాక్కం పేరిట స్థాపించిన పార్టీ కార్యకలాపాల్లో నా పేరుగానీ, ఫొటోగానీ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోను’ ’అని విజయ్ పేర్కొన్నట్లు ఉంది.
తండ్రి తాపత్రయం
తమిళనాట సినీ నటుడు దళపతి విజయ్‌కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి తెలిసిందే. దీంతో తనయుడి చేత రాజకీయ ప్రవేశం చేయించాలని గత కొన్నేళ్లుగా విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తన పేరిట ఉన్న ∙మక్కల్ ఇయక్కం ద్వారా సేవ కార్యక్రమాలతో విజయ్ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఇటీవల కాలంగా తెర కెక్కుతున్న విజయ్ చిత్రాలన్నీ రాజకీయాల చుట్టు సాగుతుండటంతో ఆయన అభిమానుల్లో రాజకీయ ఎదురు చూపులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కల్ ఇయక్కంను అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ పార్టీగా మారుస్తూ ఈసీకి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దరఖాస్తు పెట్టుకోవడం తమిళనాట చర్చకు దారి తీసింది. ఈ పార్టీకి ప్రధానకార్యదర్శిగా ఎస్‌ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా ఆయన భార్య, విజయ్ తల్లి శోభ పేర్లను పొందు పరచి ఉండటంతో రాజకీయ చర్చ మరింతగా వేడెక్కింది.
ఇది వ్యక్తిగతం.....
ఎస్‌ఏ చంద్రశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ పార్టీకి విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని వ్యాఖ్యానించారు. విజయ్ మక్కల్ ఇయక్కం అన్నది నిన్నో, మొన్నో ఏర్పాటు చేసింది కాదని, ఇందులో ఉన్న వారికి గుర్తింపు అన్నది దక్కాలన్న కాంక్షతో రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు తెలిపారు. ఈ పార్టీలోకి విజయ్ చేరుతారా.? అని ప్రశ్నించగా, ఇది ఆయన్నే అడగండి అంటూ దాట వేశారు. ఈ చర్చ నేపథ్యంలో విజయ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరును దుర్వినియోగం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. అలాగే, అనధికారికంగా తన పేరును వాడుకునే హక్కు ఎవరికి లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా,తమిళనాట 2021 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు విశ్వనటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీదిమయ్యం వ్యూహాలకు పదును పెట్టి ఉన్నది. ఇక, రాజకీయాల్లోకి వచ్చేశామన్న ప్రకటన చేసిన దక్షిణ భారత చలన చిత్రసూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ ఏర్పాటులో ఉగిసలాటలో ఉన్న నేపథ్యంలో విజయ్ పార్టీ తెర మీదకు రావడం గమనార్హం.
For those wanting the statement in the letterhead format, here's the official one! https://t.co/Q2ChPI3c8H pic.twitter.com/JiAWAZOfzy
— RIAZ K AHMED (@RIAZtheboss) November 5, 2020
Comments
Please login to add a commentAdd a comment