సాక్షి, చెన్నై : నటుడు విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌పై స్థానికి విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకెళ్లితే.. దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చిక్యుల్లో ఇరుక్కోవడం పరిపాటిగా మారింది. ఆ మధ్య విజయ్ నటించిన మెర్శల్ చిత్రం వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరుపతి దేవాలయం హుండీలో వేసే కానుకలు దేవుడికి లంచం మాదిరి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్టియన్ అయిన ఎస్‌ఏ. చంద్రశేఖర్ తిరుపతి ఆలయ హుండీ కానుకల గురించి కామెంట్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.
బీజేపీ పార్టీ నేత హెచ్.రాజా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాగా హిందు మక్కల్ కట్చికి చెందిన నారాయణన్ అనే వ్యక్తి ఎస్‌ఏ. చంద్ర శేఖర్ వ్యాఖ్యల హిందువుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయనీ, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆధారాలుంటే దర్శకుడు ఎస్.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదోశాలు జారీ చేసింది. దీంతో స్థానికి విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఏ.చంద్రశేఖర్‌పై ఐపీసీ 395 సెక్షన్ క్రింది కేసును నమోదు చేశారు. విచారణలో ఆరోపణలు నిజమైతే దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment