ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే రెండు మూవీస్ వచ్చేశాయి. కాకపోతే ఇవి ఇప్పటికే ఒకదానిలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా వేరే వాటిలోనూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి తెలుగు స్ట్రెయిట్ మూవీ కాగా, మరొకటి డబ్బింగ్ బొమ్మ. ఇంతకీ ఇవేంటి? ఏ ఓటీటీల్లో ఉన్నాయి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ!)
తెలుగమ్మాయి చాందిని చౌదరి పోలీస్‌గా నటించిన బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యేవమ్'. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. ఇదివరకే ఆహా ఓటీటీలో ఉండగా.. ఇప్పుడు సన్ నెక్స్ట్‌లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో హాట్ బ్యూటీ అషూరెడ్డి కూడా కీలక పాత్రలో నటించింది.
మరోవైపు తమిళ నటి వరలక్ష‍్మి శరత్ కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శబరి'. కూతురిని కాపాడుకోవడం కోసం ఓ తల్లి పడే తపన చుట్టూ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా తీశారు. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కొన్నిరోజుల క్రితం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఐదు భాషల్లో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. ఈ వీకెండ్ ఏమైనా థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే వీటిని ట్రై చేసి చూడండి.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment