సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తలైవా మేనియాతో అంతా సందడి సందడిగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఓ మాదిరిగా సక్సెస్ అయింది. దీంతో ఈ వీకెండ్ బాగానే వసూళ్లు రాబట్టే అవకాశముంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీ పార్ట్‌నర్‌ని ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం ఆ విషయాలు బయటకొచ్చేశాయి. ఇంతకీ 'జైలర్' ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ)
'జైలర్' కథేంటి?
టైగర్ ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీ అధికారి. విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. దీంతో కొడుకు ఆచూకీ కోసం ముత్తు చాలా తిరుగుతాడు. మరి ముత్తు, కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? అనేదే 'జైలర్' స్టోరీ.
ఆ ఓటీటీలేనే?
రజినీకాంత్ 'జైలర్' సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. తమన్నా, రమ్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతమందించగా, నెల్సన్ దర్శకుడు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడినప్పటికీ.. సన్ పిక్చర్స్ సొంత సంస్థ సన్ నెక్స్ట్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెలన్నర తర్వాత అంటే సెప్టెంబరు చివర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment