జైలర్‌ చిత్రయూనిట్‌కు ఊహించని షాక్‌. | Rajinikanth Jailer Full Movie HD Version Leaked, See Fans Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

Rajinikanth Jailer Movie: జైలర్‌ సినిమాకు షాక్‌.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్‌ లీక్‌.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో..

Published Wed, Aug 30 2023 11:34 AM | Last Updated on Wed, Aug 30 2023 1:36 PM

Rajinikanth Jailer Movie HD Print Leaked - Sakshi

రజనీకాంత్‌ పనైపోయిందంటారా?.. తలైవా ఇక్కడ.. తలైవాతో అంత ఈజీ కాదు. ఒక్క సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సూపర్‌స్టార్‌. తన కమ్‌బ్యాక్‌తో రికార్డుల మోత మోగించాడు. హుకుం.. టైగర్‌ కా హుకుం.. అన్న జైలర్‌ డైలాగ్‌కు కోట్లాది కలెక్షన్స్‌ బాక్సాఫీస్‌ మీద కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్ల వసూళ్లు రాబట్టిన జైలర్‌ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అంతలోనే ఊహించని షాక్‌ తగిలింది.

హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌
ఆన్‌లైన్‌లో అనూహ్యంగా హెచ్‌డీ ప్రింట్‌ లీకైంది. ఇది చూసి అభిమానులు సైతం షాకయ్యారు. అయితే ఆ లింక్స్‌ షేర్‌ చేయొద్దని, పైరసీని ఎంకరేజ్‌ చేయకండి అని అభ్యర్థిస్తున్నారు రజనీ ఫ్యాన్స్‌. మరోవైపు చాలామంది హెచ్‌డీ ప్రింట్‌లో ఉన్న సినిమా స్క్రీన్‌షాట్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. జైలర్‌ సినిమా ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం వల్ల థియేటర్లలో కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టే ఛాన్స్‌ ఉంది. దీంతో సన్‌ నెక్స్ట్‌ వీలైనంత త్వరగా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించే అవకాశమూ లేకపోలేదు. అటు హిందీ డబ్బింగ్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

జైలర్‌ సినిమా..
రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జైలర్‌. రమ్యకృష్ణ, వసంత రవి, వినాయకన్‌, యోగి బాబు, మిర్నా మీనన్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో మెరిశారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది.

చదవండి: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement