Vishal Laththi Movie OTT Release Date On This Date - Sakshi
Sakshi News home page

Laththi Movie: విశాల్‌ లాఠీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Published Thu, Jan 12 2023 8:25 PM | Last Updated on Thu, Jan 12 2023 8:58 PM

Vishal Laththi Movie OTT Release Date Ott - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విశాల్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లాఠీ. సునయన కథానాయిక. ఎ.వినోద్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రమణ, నంద నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు. బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించాడు. గత నెల 22న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి సన్‌ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సన్‌ నెక్స్ట్‌ అధికారికంగా ప్రకటించింది.

కథ విషయానికి వస్తే.. సిన్సియర్‌ కానిస్టేబుల్‌ అయిన మురళీకృష్ణ(విశాల్‌) తన కుటుంబమే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడిని అధికారులు సస్పెండ్‌ చేస్తారు. ఎలాగోలా తిరిగి ఉద్యోగంలో చేరతాడు కానీ ఎవరినీ లాఠీతో శిక్షించొద్దని నిర్ణయించుకుంటాడు. ఓసారి డీఐజీ ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని ఆదేశిస్తాడు. తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడిని వీరబాదుడు బాదుతాడు. ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ కొడుకు. తనను కొట్టిన మురళిపై పగపడతాడు. అతడి నుంచి మురళి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నదే మిగతా కథ.

చదవండి: వారీసు వర్సెస్‌ తునివు.. ఓపెనింగ్స్‌ ఎంత వచ్చాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement