
స్టార్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 1945. సత్య శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా, నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో నిర్మాత సి. కల్యాన్, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
దీంతో రానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్ ఆగిపోయింది. కానీ క్లైమాక్స్ చిత్రీకరణ జరపకుండానే జనవరి 7న థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్స్ట్‌లో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
Get ready for some goosebumps as Aadi battles for this motherland!
— SUN NXT (@sunnxt) February 3, 2022
1945 premiering on February 7 only on #SUNNXT#1945Movie #RanaDaggubati #ReginaCassandra #Nassar #Sathyaraj #Sathyasiva #YuvanShankarRaja @RanaDaggubati @ReginaCassandra @thisisysr @Sathyasivadir pic.twitter.com/cEBpKUISLD
Comments
Please login to add a commentAdd a comment