Shilpa Shetty Kundra
-
గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.2014లో సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్‌లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది. -
ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్
బాలీవుడ్లో పలు పోలీస్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ఈసారి తెలుగుతో సహా పలు భాషల్లో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన తర్వాత ఎలాంటి అప్డేట్లు ఇవ్వని మేకర్స్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జనవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ వెబ్ సిరీస్‌పై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. సిద్దార్త్ మల్హోత్రా, శిల్పాశెట్టిలతో పాటు వివేక్ ఒబెరాయ్, శ్వేతా తివారీ, నికితిన్ ధీర్, రితురాజ్ సింగ్, లలిత్‌లు పోలీసు అధికారులుగా ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. భారత పోలీసుల నిబద్ధతను, పరాక్రమాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. 7భాగాలుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను ముందుగా దీపావళి 8న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరికి పోస్ట్ పోన్ చేశారు. Lights, Siren, Action!🚨 Amazon Original Indian Police Force, a larger than life series to release Worldwide on Jan 19, 2024! Thrilled to be bringing this high-octane action entertainer from the incredible Rohit Shetty to audiences. Paying an ode to our Indian Police on… pic.twitter.com/vIbFKqQzL4 — prime video IN (@PrimeVideoIN) October 21, 2023 -
‘ఈ వీడియో షేర్ చేయడం ఆనందంగా ఉంది’
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. నా ‘మార్లిన్ మన్రో’ మూమెంట్ అంటూ బీచ్‌లో సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. కాగా 1955లో విడుదలైన మన్రో ‘సెవెన్ ఇయర్ ఇట్చ్’ సినిమాలో ఓ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆమె దుస్తులు పైకి ఎగురుతుంటే వెంటనే చేతులతో కిందకు లాక్కున్నారు. ఈ మన్రో మాదిరిగానే తనకూ అలాంటి అనుభవం ఎదురైందంటూ శిల్పా ఈ ఫన్నీ వీడియోను పంచుకున్నారు. ఇక శిల్పాశెట్టి కుంద్రా ప్రస్తుతం గ్రీస్, లండన్లలో కుటుంబం కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కాగా దిల్జిత్ దోసంజ్, యామీ గౌతమ్ నటిస్తున్న సినిమాతో శిల్పా బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆమె రచయితగా కనిపించనున్నారు. సెలవుల నుంచి రాగానే ఆగష్టు మొదటి వారంలో ఆమె షూటింగ్లో పాల్గొననున్నారు. View this post on Instagram My 'Marilyn Monroe' moment on the cruise wasn't exactly a 'breeze' 😄 Please watch till the end...🤦🏻♀😂 #throwback #bloopers #funtimes #vacation #cruising #slomo #laughs #epic A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Jul 23, 2019 at 7:13am PDT -
నేను ప్రెగ్నెంట్ కాదు: శిల్పా శెట్టి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గర్భం దాల్చిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌నుంచి రిపోర్ట్స్‌తో బయటకు వస్తున్న ఆమె ఫొటో సైతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై అభిమానులు #ShilpaKoKyaHua ట్యాగ్‌తో ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో శిల్పాశెట్టే స్వయంగా ఇవన్నీ గాలి వార్తలని కొట్టిపారేసారు. ‘హె భగవాన్.. అలాంటిదేం లేదు!, రెగ్యూలర్ చెకప్‌లో భాగంగానే నా శరీరానికి సంబంధించిన పరీక్షలను ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్‌లో చేయించుకున్నాను. అందరూ చేయించుకునే పరీక్షలే. నేను ప్రెగ్నెంట్‌ను కాదు. అవన్నీ గాలి వార్తలే’ అని ట్వీట్ చేశారు. #ShilpaKoKyaHua KUCH NAHI! Hey Bhagwan 😅I get a preventive health check done at SRL regularly to know that my body is as healthy on the inside as the outside.Something we all must do.What's all the fuss about !! And NO not pregnant🙄 #healthcheck #preventionisbetterthancure — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) June 16, 2018 ఇటీవల ఎస్ఆల్ఎర్ డయాగ్నస్టిక్స్ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న శిల్పాశెట్టి ఫొటోను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ శిల్పాశెట్టి చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని ఓ టెస్ట్ ల్యాబ్ సెంటర్ బయట ఉండటం చూశాను. ఎదైనా అద్భుతమా అని’ ఆ ఫొటో క్యాఫ్షన్‌గా ట్వీట్ చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఇక ఆమెకు ఆరేళ్ల కొడుకు వియాన్ రాజ్‌కుంద్రా ఉన్న విషయం తెలిసిందే. So now, the news is that Shilpa Shetty was seen outside a test lab with reports in her hand. And the world wonders what’s going on...#ShilpaKoKyaHua pic.twitter.com/5mQdm9lJi3 — Chethana (@Tall_Dreams) June 16, 2018 -
అందుకే సినిమాల్లో నటించడం లేదు
కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. కాగా పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి మాత్రం వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. 2008లో వచ్చిన దోస్తానా ఆమె చివరి చిత్రం. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం గురించి శిల్పా మాట్లాడుతూ.. తనకు అవకాశాలు వచ్చాయని, అయితే చెత్తపాత్రలు కావడంతో తిరస్కరించాని చెప్పింది. ఇలాంటి పాత్రల్లో నటించి సమయం వృథా చేసుకోలేనని అంది. గతంలో తాను నటించిన సినిమాల పట్ల సంతృప్తిగా ఉందని, ఇకముందు ఆసక్తికర పాత్రల్లో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తానని చెప్పింది. సినిమాల్లో నటించకున్నా తాను అభిమానులకు దూరం కాలేదని, టీవీల్లో తనను చూస్తూనే ఉన్నారని శిల్పా చెప్పింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నట్టు తెలిపింది. -
శిల్పా శెట్టి చేతికి హిందుస్తాన్..
న్యూఢిల్లీ: సెలబ్రిటీల జంట శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్(హెచ్ఎస్జీఐఎల్ ) కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. విడిగా 25.75% చొప్పున వాటాలను కొనుగోలు చేసినట్లు ఈ జంట బీఎస్ఈకి వెల్లడించింది. సెప్టెంబర్ 3న ఈ వాటాలను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. కాగా, కంపెనీ షేర్లలో ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి బీఎస్ఈలో ట్రేడింగ్ నిలిచిపోయింది. ఈ షేరులో చివరిసారిగా రూ. 10.10 ధరలో లావాదేవీలు జరిగాయి. ఇక శిల్పా జంట తరఫున మార్క్ కార్పొరేట్ అడ్వయిజర్స్ మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 12 ధరను చెల్లించనుంది. తద్వారా 26% వాటా కోసం రూ. 95.32 లక్షలు వెచ్చించనుంది.