శిల్పా శెట్టి (ఫైల్ ఫొటో)
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గర్భం దాల్చిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌నుంచి రిపోర్ట్స్‌తో బయటకు వస్తున్న ఆమె ఫొటో సైతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై అభిమానులు #ShilpaKoKyaHua ట్యాగ్‌తో ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో శిల్పాశెట్టే స్వయంగా ఇవన్నీ గాలి వార్తలని కొట్టిపారేసారు. ‘హె భగవాన్.. అలాంటిదేం లేదు!, రెగ్యూలర్ చెకప్‌లో భాగంగానే నా శరీరానికి సంబంధించిన పరీక్షలను ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నస్టిక్స్‌లో చేయించుకున్నాను. అందరూ చేయించుకునే పరీక్షలే. నేను ప్రెగ్నెంట్‌ను కాదు. అవన్నీ గాలి వార్తలే’ అని ట్వీట్ చేశారు.
#ShilpaKoKyaHua KUCH NAHI! Hey Bhagwan 😅I get a preventive health check done at SRL regularly to know that my body is as healthy on the inside as the outside.Something we all must do.What's all the fuss about !! And NO not pregnant🙄 #healthcheck #preventionisbetterthancure
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) June 16, 2018
ఇటీవల ఎస్‌ఆల్‌ఎర్ డయాగ్నస్టిక్స్ నుంచి రిపోర్టులతో బయటకు వస్తున్న శిల్పాశెట్టి ఫొటోను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ శిల్పాశెట్టి చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని ఓ టెస్ట్ ల్యాబ్ సెంటర్ బయట ఉండటం చూశాను. ఎదైనా అద్భుతమా అని’ ఆ ఫొటో క్యాఫ్షన్‌గా ట్వీట్ చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఇక ఆమెకు ఆరేళ్ల కొడుకు వియాన్ రాజ్‌కుంద్రా ఉన్న విషయం తెలిసిందే.
So now, the news is that Shilpa Shetty was seen outside a test lab with reports in her hand.
— Chethana (@Tall_Dreams) June 16, 2018
And the world wonders what’s going on...#ShilpaKoKyaHua pic.twitter.com/5mQdm9lJi3
Comments
Please login to add a commentAdd a comment